*ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయం*
*భైంసా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు.. నివాళులర్పించిన భోంస్లే నారాయణరావు పటేల్*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 19:-
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరొందిన స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం భైంసాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి భోంస్లే నారాయణరావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను, ఆమె చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరా గాంధీ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఇందిరా గాంధీ ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా భోంస్లే నారాయణరావు పటేల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మకు ఘనంగా నివాళులర్పించారు.

