ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయం
*ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయం* *భైంసా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు.. నివాళులర్పించిన భోంస్లే నారాయణరావు పటేల్* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 19:- భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరొందిన స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం భైంసాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి...