📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణధని’, ‘ముద్ర' ఆన్‌లైన్ లోన్ పేరుతో మోసం నిందితుడి అరెస్ట్

ధని’, ‘ముద్ర’ ఆన్‌లైన్ లోన్ పేరుతో మోసం నిందితుడి అరెస్ట్

📰 Generate e-Paper Clip

‘ధని’, ‘ముద్ర’
ఆన్‌లైన్ లోన్ పేరుతో మోసం నిందితుడి అరెస్ట్

జనగాం జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జనగామ జిల్లాలో ఆన్‌లైన్ లోన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాలగణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన నందన పోయిన సందీప్ (26) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ఫేస్‌బుక్‌లో ‘ధని’, ‘ముద్ర’ ఆన్‌లైన్ లోన్ల పేరుతో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది
ఆ తర్వాత కొల్లూరి మోహన్ అనే వ్యక్తితో కలిసి రూమ్ తీసుకుని, ‘జై భవాని మాత’ అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ద్వారా లోన్ కావాలని అడిగిన బాధితులను ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ పేరుతో నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకున్నారు.

ఇలా వచ్చిన మొత్తంలో 10 శాతం కమిషన్ తీసుకుని జల్సాలకు పాల్పడ్డారని విచారణలో అంగీకరించారు.

నిందితులపై వరంగల్ కమిషనరేట్ పరిధిలో 5, తెలంగాణలో 84, ఇతర రాష్ట్రాల్లో 292 కేసులు నమోదయ్యాయి. నిందితుడిని జనగామ చౌరస్తాలో అదుపులోకి తీసుకున్నామని సిఐ తెలిపారు.

ఆన్‌లైన్‌లో తెలియని వ్యక్తులు లోన్లు ఇస్తామని చెబితే నమ్మవద్దని, మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు.

నిందితులను పట్టుకోవడంలో సహకరించిన వరంగల్ సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, ఎస్సైలు చరణ్, ప్రవీణ్, జనగామ పోలీసు సిబ్బందికి సీఐ ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.