📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో విగ్రహల...

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో విగ్రహల ప్రతిష్ట

📰 Generate e-Paper Clip

*అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో విగ్రహల ప్రతిష్ట లో పాల్గొన్న – ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

చండూర్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. మహోత్సవం లో భాగంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమం, ధ్వజస్తంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రతిష్టించిన అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉదయం మంగళవాయిద్యాలు, సుప్రభాతం, గణపతి పూజలతో ప్రారంభమైన కార్యక్రమాల్లో భాగంగా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహం, ఇతర దేవతామూర్తుల ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు. బలిహరణం, కుంభ నివేదన, నేత్రోన్మీలనం, బ్రహ్మకలశ ఉద్వాసన తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మధ్యాహ్నం బృహత్తర అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.