నారాయణఖేడ్ నియోజకవర్గం:- (ప్రజావాణి) ఇంచార్జ్ మదుసుదన్
సంజీవన్ రావుపేట్‌లో వైభవంగా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
నారాయణఖేడ్: సంజీవన్ రావుపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామాల్లో శాంతి, సౌభాగ్యాలు, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన గ్రామస్తులు, దాతలు, ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండరి రెడ్డి, రమేష్ చౌహన్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

