రామాయంపేట ప్రజావాణి కార్యక్రమం లో 15 ఫిర్యాదులు స్వీకరణ
రామాయంపేట,నవంబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి నరేష్ నాయక్):
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 15 అర్జీలు అందాయి. ఈ విషయాన్ని ఎంపీడీవో షాజీలోద్దీన్ వెల్లడించారు. వచ్చిన అర్జీల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 8, రెవెన్యూ శాఖకు సంబంధించి 6, మున్సిపాలిటీకి సంబంధించి ఒక అర్జీ ఉన్నట్లు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, అర్జీదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
