రామాయంపేట ప్రజావాణి కార్యక్రమం లో 15 ఫిర్యాదులు స్వీకరణ

రామాయంపేట ప్రజావాణి కార్యక్రమం లో 15 ఫిర్యాదులు స్వీకరణ రామాయంపేట,నవంబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి నరేష్ నాయక్): మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 15 అర్జీలు అందాయి. ఈ విషయాన్ని ఎంపీడీవో షాజీలోద్దీన్ వెల్లడించారు. వచ్చిన అర్జీల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 8, రెవెన్యూ శాఖకు సంబంధించి 6, మున్సిపాలిటీకి సంబంధించి ఒక అర్జీ ఉన్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు...