📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. బొల్లంపల్లిసర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. బొల్లంపల్లిసర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం

📰 Generate e-Paper Clip

*ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. బొల్లంపల్లిసర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం*

ప్రజావాణి,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, నవంబర్ 17 :రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనుందని బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ పేర్కొన్నారు. కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఈ పథకం తోడ్పడుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు. కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల సభ్యులకు వ్యక్తిగత జీవిత బీమా సౌకర్యం వర్తిస్తుందని, వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డును ప్రాథమిక ఆధారంగా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.