📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసంక్షేమ పధకలకు కేర్ అఫ్ కాంగ్రెస్ ప్రభుత్వమే

సంక్షేమ పధకలకు కేర్ అఫ్ కాంగ్రెస్ ప్రభుత్వమే

📰 Generate e-Paper Clip

*సంక్షేమ పధకలకు కేర్ అఫ్ కాంగ్రెస్ ప్రభుత్వమే*

*అన్నీ వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం : చైర్మన్ ఏం అశోక్*

*135 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ*

*కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అశోక్, హన్నన్ జావీద్*

కోహిర్, నవంబర్ 16 (ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘చేయూత’ (ఆసరా) పింఛన్ల పథకంలో భాగంగా, కోహిర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కోహిర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 135 మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్ మంజూరు రసీదులను అందజేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు మరియు వార్డు కౌన్సిలర్ల సమక్షంలో ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు మరియు ఇతర బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎం అశోక్, మున్సిపల్ వైస్ చైర్మన్ హన్నాన్ జావీద్, మున్సిపల్ కమిషనర్ చికినే శశిధర్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.