📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసేవే లక్ష్యంగా సయ్యద్ అస్లాం ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం

సేవే లక్ష్యంగా సయ్యద్ అస్లాం ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం

📰 Generate e-Paper Clip

*సేవే లక్ష్యంగా సయ్యద్ అస్లాం ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి):జనగామ పట్టణంలోని 29వ వార్డు, గుండ్లగడ్డ కమ్యూనిటీ హాల్‌లో సోమవారం సయ్యద్ అస్లాం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ అస్లాం ప్రత్యేక చొరవ తీసుకొని, హనుమకొండకు చెందిన శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్ వైద్యులను ఆహ్వానించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా స్థానిక ప్రజలు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు కంటి సమస్యలను పరీక్షించి, అవసరమైన వారికి తగిన వైద్య సలహాలు, సూచనలు అందించారు.

ఈ సందర్భంగా సయ్యద్ అస్లాం మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్వయంగా ఏర్పాటు చేసి వైద్యులను ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్ వైద్య బృందానికి, పాల్గొన్న ప్రజలకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ సయ్యద్ అస్లాం కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.