📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఆయుధంతో కొడితే గాయమవుతుంది.. అక్షరంతో కొడితే చరిత్ర మారుతుంది!

ఆయుధంతో కొడితే గాయమవుతుంది.. అక్షరంతో కొడితే చరిత్ర మారుతుంది!

📰 Generate e-Paper Clip

*నేటి మాట*

మీ ప్రజావాణి లో

ఆయుధంతో కొడితే గాయమవుతుంది.. అక్షరంతో కొడితే చరిత్ర మారుతుంది!
ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకం
పాత్రికేయం అనేది కేవలం వార్తలను సేకరించి ప్రచురించడం మాత్రమే కాదు. సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని వెలుగులోకి తీసుకువస్తూ ప్రజల పక్షాన నిలబడే బాధ్యతాయుతమైన వృత్తి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను సేకరించి, నిజానిజాలను నిర్ధారించి వార్తల రూపంలో ప్రజల ముందుంచడం మీడియా బాధ్యత. పేదల కష్టాలు, రైతుల సమస్యలు, కార్మికుల ఇబ్బందులు, విద్యార్థుల అవసరాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పనితీరు వంటి అనేక అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల కలం నిరంతరం పనిచేస్తుంది.
అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అప్రమత్తం చేయడం, బాధితులకు న్యాయం జరిగేలా వారి గొంతుకను వినిపించడం పాత్రికేయుల ప్రధాన బాధ్యత. అయితే ఈ బాధ్యతను నిర్వహించే క్రమంలో ఎవరికీ అనుకూలంగా వ్యవహరించకుండా, ఎవరికీ భయపడకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వాస్తవాల ఆధారంగా వార్తలు రాయాలి.
ఒక పాత్రికేయుడు రాసే వార్త ఒక సమస్యకు పరిష్కారం చూపవచ్చు. అధికార యంత్రాంగాన్ని కదిలించవచ్చు. బాధితులకు న్యాయం అందించవచ్చు. అందుకే కలానికి ఉన్న శక్తి ఎంతో గొప్పది. అదే సమయంలో తప్పుడు వార్తలు, వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలకు దూరంగా ఉంటూ వృత్తి విలువలను కాపాడుకోవాలి.
ఆయుధంతో కొడితే గాయమవుతుంది.. అక్షరంతో కొడితే చరిత్ర మారుతుంది.
ప్రజాస్వామ్యానికి బలమైన పునాది స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత పాత్రికేయం. ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, సమాజ మార్పు కోసం కలంతో పోరాడే ప్రతి పాత్రికేయుడికి సమాజంలో గౌరవం దక్కాలి.
నో ఫేవర్.. నో ఫియర్..
అంటే ఎవరికీ అనుకూలం కాదు.. ఎవరికీ భయం కాదు. నిజం వైపు నిలబడటమే నిజమైన పాత్రికేయ ధర్మం.
– నేటి మాట (ప్రజావాణి) లింగం మంచాల

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.