📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణచామల రంగాయనాయకమ్మ సంస్మరణలో నివాళులర్పించిన వంశీధర్ రెడ్డి

చామల రంగాయనాయకమ్మ సంస్మరణలో నివాళులర్పించిన వంశీధర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

చామల రంగాయనాయకమ్మ సంస్మరణలో నివాళులర్పించిన వంశీధర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నానమ్మ స్వర్గీయ చామల రంగాయనాయకమ్మ సంస్మరణ కార్యక్రమం శౌలిగౌరారంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనగామ డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, రంగాయనాయకమ్మ ఎంతో ఆదర్శవంతమైన జీవితం గడిపారని, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆశీస్సులతోనే చామల కుటుంబం ప్రజా సేవలో ముందుంటుందని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సంస్మరణ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.