📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకలం వందనం... జర్నలిస్టులకు ఘన సన్మానం

కలం వందనం… జర్నలిస్టులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

*కలం వందనం… జర్నలిస్టులకు ఘన సన్మానం*

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ నవంబర్ 16 ప్రజావాణి:+*

కలం పట్టిన వారికి కలం ఫౌండేషన్ వందనం చేసింది. జాతీయ పత్రికా దినోత్సవం అంటే కేవలం ఒక రోజు కాదు, ప్రజల కోసం రాత్రి పగలు తిరిగే విలేకరుల త్యాగానికి గుర్తింపు. అదే స్ఫూర్తితో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.
వేదిక మీదకు ఒక్కొక్క విలేకరిని పిలిచినప్పుడు, చప్పట్లు మారుమోగాయి. సీనియర్ విలేకరి పెండ్యాల ఇందిరాదేవి, నల్లబెల్లి సాంబయ్య పటేల్, కేథిరి భిక్షపతి, బీరెల్లి రమేష్, మామిళ్ల సంపత్‌లను శాలువాలతో సత్కరించారు. వారి ముఖాల్లో సంతోషం, కళ్లల్లో గర్వం కనిపించింది. ఏళ్ల తరబడి గ్రామాల్లో తిరిగి, ప్రజా సమస్యలను వార్తలుగా మలిచిన వారికి ఇది నిజమైన గౌరవం.
ఈ సందర్భంగా కలం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండీ సర్వర్ అహ్మద్ మాట్లాడుతూ… “జర్నలిజం అంటే ఉద్యోగం కాదు, బాధ్యత. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం. ప్రజలకు వాస్తవాలను చేరవేయడం, పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా కలాన్ని ఉపయోగించడం విలేకరి ధర్మం” అని అన్నారు.
బాధితుల పక్షాన నిలబడి, వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేయాలి. నిష్పక్షపాతంగా, నిర్భయంగా రాయడమే నిజమైన జర్నలిజం” అని ఆయన పిలుపునిచ్చారు.
సన్మానం అందుకున్న విలేకరులు భావోద్వేగంతో మాట్లాడారు. “సమాజ హితం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగిస్తాం. ప్రజల గొంతుకగా నిలుస్తూ మా వంతు కృషి చేస్తాం” అని తెలిపారు.
గ్రామస్తులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై విలేకరులను అభినందించారు. పత్రికా దినోత్సవం రోజున విలేకరులను ఇలా గౌరవించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కలం ఫౌండేషన్ కార్యదర్శి పెండ్యాల సలేంద్రం, కోశాధికారి ఎండీ సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.