కలం వందనం… జర్నలిస్టులకు ఘన సన్మానం
*కలం వందనం... జర్నలిస్టులకు ఘన సన్మానం* *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 16 ప్రజావాణి:+* కలం పట్టిన వారికి కలం ఫౌండేషన్ వందనం చేసింది. జాతీయ పత్రికా దినోత్సవం అంటే కేవలం ఒక రోజు కాదు, ప్రజల కోసం రాత్రి పగలు తిరిగే విలేకరుల త్యాగానికి గుర్తింపు. అదే స్ఫూర్తితో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. వేదిక మీదకు ఒక్కొక్క విలేకరిని పిలిచినప్పుడు, చప్పట్లు మారుమోగాయి. సీనియర్ విలేకరి పెండ్యాల ఇందిరాదేవి, నల్లబెల్లి సాంబయ్య...