📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ సత్వర పరిష్కారం చూపాలి

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 16:

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి.శ్రీరాములుతో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఒక్కొక్కరి సమస్యను అడిగి తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను పంపిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజావాణిలో వచ్చిన ప్రధాన అర్జీలు..

బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వినతి: రామగుండం మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన ప్రజలు గ్రామ సమీపంలో సుమారు 40 సంవత్సరాల క్రితం వర్షపు నీరు వెళ్లేందుకు రెండు పైపులతో నిర్మాణం చేపట్టారని, ప్రస్తుతం ఆ నిర్మాణం స్థానంలో బ్రిడ్జి నిర్మించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రామగుండం-2 జనరల్ మేనేజర్‌కు అర్జీని పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కుటుంబ పోషణపై చర్యలు తీసుకోవాలి: సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన మూట రాధ తాను దివ్యాంగురాలినని, తన భర్త ఎలుగు కుమార్ తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని, కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ అర్జీ సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సుల్తానాబాద్ తహసీల్దార్‌కు దరఖాస్తును పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొత్త పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి: శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సామ తిరుపతి తాను దివ్యాంగుడినని, చేయూత పథకం కింద కొత్త పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత గ్రామీణాభివృద్ధి అధికారికి అర్జీని పంపించి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి: పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన దుబ్బాకుల శారద తాను నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగురాలినని, సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పీడీ హౌసింగ్‌కు దరఖాస్తును పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా శాఖల అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.