అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం , ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా, రామచంద్రునాయక్
నర్సింహులపేట, నవంబర్ 16 (ప్రజావాణి):
నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
అలాగే ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.
నర్సింహులపేట మండలంలో నూతనంగా మంజూరైన 471 మంది లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో కరువు కాటకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున ముందస్తుగా నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు వరి సాగులో నీటిని అవసరానికి మించి వినియోగించకుండా, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా ఉపయోగించుకోవాలని తెలిపారు.
కరువు కాటకాలను ఎదుర్కోవాలంటే నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని డోర్నకల్ ఎమ్మెల్యే డా. జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడివో అంజలి, ఎంపీవో అశోక్ , డీపీఓ, గ్రామ కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ,అద్యక్షులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు వృద్దులు, గ్రామ సిబ్బంది,గ్రామ ప్రజలు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
