📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసిపిఎస్ రద్దు చేయాలంటూ నేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సామూహిక సెలవు

సిపిఎస్ రద్దు చేయాలంటూ నేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సామూహిక సెలవు

📰 Generate e-Paper Clip

​సీపీఎస్ రద్దు చేయాలంటూ నేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సామూహిక సెలవు
​పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్

​మంగళవారం కార్యాలయ సేవలకు అంతరాయం కలిగే అవకాశం

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16

​అడవిదేవులపల్లి, మండల తహసీల్దార్ కార్యాలయం లో
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అడవిదేవులపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఉద్యమ బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతుగా మంగళవారం (17-11-2026) ఒకరోజు సామూహిక సాధారణ సెలవు (Mass Casual Leave) పాటిస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
​పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. ఉద్యోగుల దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది సామూహిక సెలవు నేపథ్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.