జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల
(బాలికలు)లో నిర్వహించిన 2026–27 విద్యా సంవత్సరపు జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బందిని అభినందించారు. విజేతలైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం. ఇందిర అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

