📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాంధారి ఖిల్లాపై రన్నర్స్ ట్రెక్కింగ్

గాంధారి ఖిల్లాపై రన్నర్స్ ట్రెక్కింగ్

📰 Generate e-Paper Clip

*గాంధారి ఖిల్లాపై రన్నర్స్ ట్రెక్కింగ్*

*భవిష్యత్తులో భారీ ట్రెక్కింగ్ కు రూట్ మ్యాపింగ్*

* *మన ప్రజావాణి మందమర్రి:-*

మండలంలోని బొక్కలగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని చారిత్రక గాంధారి ఖిల్లాపై మందమర్రి రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది రన్నర్స్, వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం ఆరు కిలోమీటర్ల మేర ఎత్తైన, క్లిష్టమైన గుట్టలపై సాహసయాత్ర కొనసాగగా, గాంధారి ఖిల్లా చారిత్రక నేపథ్యం, ప్రాచీన విశిష్టత, ప్రకృతి రమణీయతను తెలుసుకుంటూ, అన్ని ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించారు. ఈసందర్భంగా నిర్వాహకులు, జిల్లాలో గాంధారి ఖిల్లాకు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉందని, ప్రకృతి అందాలతో అలరించే ఈ ప్రాంతాన్ని మరింత మందికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భారీ స్థాయిలో ట్రెక్కింగ్ నిర్వహించేందుకు ప్రాథమికంగా రూట్ మ్యాపింగ్ చేపట్టామని తెలిపారు. ఎత్తయిన గాంధారి శిఖరాన్ని చేరుకునే మార్గాలను పరిశీలించి, 4 ముఖ్యమైన ట్రెక్కింగ్ పాయింట్లను గుర్తించామని, భారీ ట్రెక్కింగ్ కు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ట్రెక్కింగ్ పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ భవిష్యత్ భారీ ట్రెక్కింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. గాంధారి ఖిల్లా చారిత్రక వైభవాన్ని, ప్రకృతి అందాలను ప్రపంచానికి పరిచయం చేస్తే, జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు వస్తారని, తద్వారా స్థానిక ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని గాంధారి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.ట్రెక్కింగ్ ను ప్రోత్సహించడం, యువతలో ఆరోగ్యంపై అవగాహన, ప్రకృతి పట్ల ఆసక్తి పెంచడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో రన్నర్స్ గుడికందుల రమేష్, పప్పు నారాయణ, వడ్డేపల్లి సాయికృష్ణ, పద్మ, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన రన్నర్స్, వాకర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.