గాంధారి ఖిల్లాపై రన్నర్స్ ట్రెక్కింగ్
*గాంధారి ఖిల్లాపై రన్నర్స్ ట్రెక్కింగ్* *భవిష్యత్తులో భారీ ట్రెక్కింగ్ కు రూట్ మ్యాపింగ్* * *మన ప్రజావాణి మందమర్రి:-* మండలంలోని బొక్కలగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని చారిత్రక గాంధారి ఖిల్లాపై మందమర్రి రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది రన్నర్స్, వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం ఆరు కిలోమీటర్ల మేర ఎత్తైన, క్లిష్టమైన గుట్టలపై సాహసయాత్ర కొనసాగగా, గాంధారి ఖిల్లా చారిత్రక నేపథ్యం, ప్రాచీన విశిష్టత, ప్రకృతి రమణీయతను...