TUWJ-IJU వర్కింగ్ జర్నలిస్ట్స్ మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన బచ్చల సుభాష్ను జిల్లా, మండల ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిజం రంగంలో జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఆయన మరింత ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధికి తన కలం ద్వారా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చిప్పకుర్తి మల్లేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణు మాదిగ, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాదిగ, మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్ మాదిగ, ప్రధాన కార్యదర్శి జిల్లపెల్లి వినయ్ రాజ్ మాదిగ, ఉపాధ్యక్షుడు చిన్నయ్య, మండల ఇన్చార్జి తగరపు సత్యం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు లింగపెల్లి బాపన్న, మాజీ మండల అధ్యక్షుడు మంతెన నవీన్, సీనియర్ నాయకులు ఆవుల గంగయ్య, ఆరెపెల్లి రమేష్, ప్రమోద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

