భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవానికి వొడితల ప్రణవ్ బాబు రూ.2,00,116 విరాళం
* గ్రామ ఐక్యత సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బొడ్రాయి ప్రణవ్ బాబు
జమ్మికుంట నవంబర్ 15 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవానికి హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు రూ.2,00,116 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని గ్రామ సర్పంచ్ కర్ర విజయ భగవాన్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో అందించారుఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూబొడ్రాయి తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారుగ్రామానికి బొడ్రాయి నాభిశిలగా గ్రామదేవతలకు ప్రతినిధిగా భావిస్తారని తెలిపారు. గ్రామం మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠించడం గ్రామ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారుబొడ్రాయి ప్రతిష్ఠాపన అనేది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప వేడుక అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారుభూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో రెడ్డిపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారుమన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రణవ్ బాబు పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలోమోటం శ్రీనివాస్
వీణవంక పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సునీల్, సాహెబ్ హుస్సేన్, వావినిల సత్యనారాయణ, జడల శ్రీకాంత్, మేక శ్రీనివాస్, ఐలయ్య యాదవ్ నల్ల కొండల్ రెడ్డి సంపత్ అడిగొప్పుల హరీష్ రెడ్డి, అనిల్ రెడ్డి ఉపేందర్ రెడ్డి మోటం శ్రీనివాస్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

