📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి

బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి

📰 Generate e-Paper Clip

*బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి*

*16వ తేదీన బాలల ప్రజావాణి*

*యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 15*

బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సాధారణ ప్రజావాణితో పాటు బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణ , వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సాధారణ ప్రజావాణి తోపాటు ప్రత్యేకంగా ‘బాలల ప్రజావాణి’ నిర్వ హించాలని నిర్ణయించింది. ఈ బాలల ప్రజావాణిలో బాలలకు సంబంధించిన విద్య , ఆరోగ్యం , పోష కాహారం , బాలల హక్కుల పరిరక్షణ , బాలల భద్రత , బాల్య వివాహాల నివారణ , బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన , అనాథ , సంరక్షణ అవసర మైన బాలల సమస్యలు , బాలల అభివృద్ధి తదితర అంశాలపై ఫిర్యాదులు , వినతులు స్వీకరించ నున్నట్లు తెలిపారు. అలాగే బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువచ్చి , వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బాలల సంక్షేమం కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు , తల్లి దండ్రులు , ఉపాధ్యాయులు , బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులు కూడా తమ పరిధిలోని బాలల సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. బాలలకు మెరుగైన భవిష్యత్తును అందించడంతోపాటు , వారి హక్కులను కాపాడి , సమస్యలకు పరిష్కారం చూపడమే బాలల ప్రజా వాణి ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.