*పేదల కోసం పని చేసేది బిఅర్ఎస్ పార్టీనే : మాజీ ఎంపిటిసి సావుద్ షాహిద్*
*మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు లబ్ధిదారునికి సీఎం రిలీఫ్ చెక్కు అందజేత*
ప్రజావాణి, జహిరాబాద్: గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ హయాంలో నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమలు అమలు చెయ్యడం జరిగిందని, అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రతి పిహెచ్సీ, ఏరియా అసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించే విధంగా పని చేశారాని మాజీ ఎంపిటిసి సవుద్ షాహిద్ అన్నారు. శనివారం నాడు మాజీ వైద్య మంత్రి, సిద్దిపేట శాసన సభ సభ్యులు తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు మోమిన్ పేట్ గ్రామానికి చెందిన లబ్దిదారులకు స్థానిక కౌన్సిలర్ ప్రతినిది మొహమ్మద్ అజరుద్దీన్ తో కలిసి మాజీ ఎంపిటిసి షాహిద్ రెండు సీఎం రిలీఫ్ చెక్కులను 39500/ మరియు 10500 రు లను అందజేశారు. చెక్కుల విలువ సుమారు 50 వెయ్యిల రూపాయలు ఉంది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ సొంత ఖర్చుతో వైద్యం చేసుకొని మాజీ మంత్రి హరీష్ రావు ద్వారా సీఎం రిలీఫ్ చెక్కుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో రెండు చెక్కులు మంజూరు అయ్యాయని అన్నారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారుడు మాజీ మంత్రి హరీష్ రావు కీ కృతజ్ఞతలు తెలిపారు.

