దూదియాతండాలో నూతన పెన్షన్ల మంజూరుతో పండుగ వాతావరణం
24 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ లావూరి రమాదేవి శ్రీనివాస్
చిలుకూరు, నవంబర్ 14 (ప్రజావాణి):దూదియాతండా గ్రామంలో నూతన పెన్షన్లు మంజూరు కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా పెన్షన్లు మంజూరైన 24 మంది అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ లావూరి రమాదేవి శ్రీనివాస్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పెన్షన్ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పెన్షన్లు మంజూరు కావడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొర్ర సురేష్, గ్రామ కార్యదర్శి వి. సౌరిక, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. నూతనంగా పెన్షన్లు పొందిన 24 మంది లబ్ధిదారులకు గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున అభినందనలు తెలిపారు.

