📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచెన్నారిగూడెంలో నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

చెన్నారిగూడెంలో నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

📰 Generate e-Paper Clip

*చెన్నారిగూడెంలో నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ*

*లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు*

చిలుకూరు, నవంబర్ 14 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా చెన్నారిగూడెం గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన పేదలు, వృద్ధులు, ఇతర లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పరిపాలన అధికారి, కార్యదర్శి రామారావు, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెండ్రాతి హనుమంతరావు, గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు ఓబయ్య, కొవ్వూరు వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు పుట్టపాక వెంకయ్య, కమతం నాగరాజు, సూరపల్లి నాగరాజు, కొవ్వూరి వెంగయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.