*గీతా విద్యాలయం లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు*
*ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి కి జాతీయ స్థాయి ‘నెహ్రూ అవార్డు’ ప్రదానం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి ని పురస్కరించుకుని శనివారం చండూరు లోని గీతా విద్యాలయం (ఇంగ్లీష్/మీడియం) పాఠశాల లో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తూ నెహ్రూ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయ స్థాయి నెహ్రూ అవార్డు ప్రదానం:
విద్యా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా పాఠశాల ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి కి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘నెహ్రూ అవార్డు’ లభించింది. శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంబాలపల్లి శివలీల చేతుల మీదుగా ఈ అవార్డును నరసింహాచారి కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

