*చండూరులో అల్ట్రాటెక్ సిమెంట్ ఆధ్వర్యంలో మేస్త్రీల సమావేశం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి – ప్రజావాణి*
చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ గణేష్ స్టీల్స్ అండ్ సిమెంట్ షాప్ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతినిధుల ఆధ్వర్యంలో మేస్త్రీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మేస్త్రీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతినిధులు సిమెంట్ నాణ్యత, వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన నిర్మాణ పద్ధతులపై మేస్త్రీలకు వివరించారు. అనంతరం షాప్ ప్రొప్రైటర్ సంగెపు గణేష్ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన మేస్త్రీలకు, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

