prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 9:02 am Digital Edition : PRAJA VANI

​గీతా విద్యాలయం లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

*​గీతా విద్యాలయం లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు*

*ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి కి జాతీయ స్థాయి ‘నెహ్రూ అవార్డు’ ప్రదానం*
​
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌ లాల్ నెహ్రూ జయంతి ని పురస్కరించుకుని శనివారం చండూరు లోని గీతా విద్యాలయం (ఇంగ్లీష్/మీడియం) పాఠశాల లో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తూ నెహ్రూ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ
​కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

​జాతీయ స్థాయి నెహ్రూ అవార్డు ప్రదానం:

విద్యా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా పాఠశాల ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి కి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘నెహ్రూ అవార్డు’ లభించింది. శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంబాలపల్లి శివలీల చేతుల మీదుగా ఈ అవార్డును నరసింహాచారి కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.