📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనర్మెట్టలో సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం మరియు గ్రామసభ వేడుకలు

నర్మెట్టలో సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం మరియు గ్రామసభ వేడుకలు

📰 Generate e-Paper Clip

నర్మెట్టలో సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం మరియు గ్రామసభ వేడుకలు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి):ప్రజా పాలనలో భాగంగా జిల్లా లోని నర్మెట్ట మండల కేంద్రం, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం గ్రామసభ, అత్యంత ఘనంగా నిర్వహించబడింది.

దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని చిల్డ్రన్స్ డే (బాలల దినోత్సవం) వేడుకలను గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు.

గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకలకు పిల్లలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారుల కేరింతలు, ఉత్సాహభరితమైన ఆటపాటలతో గ్రామ పంచాయతీ ప్రాంగణమంతా పండగ వాతావరణాన్ని తలపించింది. పిల్లలు తమ ప్రతిభను చాటుకుంటూ విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల ద్వారా అందరినీ ఎంతగానో అలరించారు. తమ భావనలను, సంతోషాన్ని నిర్భయంగా వ్యక్తపరుస్తూ వారు చేసిన సందడి అక్కడివారందరినీ మంత్రముగ్ధులను చేసింది.

ఆటపాటలతో అలరించిన పిల్లలకు సర్పంచ్ శ్రీధర్ గౌడ్ బహుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో పిల్లలలో మరింత ఉత్సాహం పెరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, వారి ఉజ్వల భవిష్యత్తుకు, సర్వతోముఖాభివృద్ధికి గ్రామ పంచాయతీ తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.

గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజా పాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే, ఇలాంటి చిన్నారుల వేడుకలను ప్రోత్సహించడం ద్వారా గ్రామంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు.

గ్రామసభలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు చిన్నారుల కేరింతలు, ఉత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలు నర్మెట్ట గ్రామ ప్రజల ప్రశంసలను పొందాయి.

ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సుమన్, కార్యదర్శి నసీరుద్దీన్ మరియు ఉప సర్పంచ్ కోలెపాక స్వామి, వార్డు మెంబర్లు కొలెపాక యాదగిరి, చెప్పాల మహిపాల్ రెడ్డి, పొన్నం బాలకృష్ణ, కొన్నే యాదలక్ష్మి చంద్రయ్య, కూకట్ల మమతా సంపత్, తుప్పుడు శ్రావణి మహేష్, గోరంతల స్వాతి రాజు, నాయకులు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, యువకులు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.