📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకళ్లెం కృష్ణను పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి..

కళ్లెం కృష్ణను పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి..

📰 Generate e-Paper Clip

*కళ్లెం కృష్ణను పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి…*

*హన్మక్క మృతి పట్ల పల్లా వెంకట్ రెడ్డి సంతాపం.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 14*

సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ గారి మాతృ మూర్తి కళ్లెం హన్మక్క అనారోగ్యంతో మృతి చెందడంతో సీపీఐ జాతీయ కార్యదర్శి , మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి శనివారం రోజు భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలోని కళ్లెం కృష్ణ స్వగృహానికి విచ్చేసి హన్మక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళ్లెం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్ రెడ్డి హన్మక్క మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ , వారి కుటుంబానికి మనో ధైర్యన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి , జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్య నారాయణ , జిల్లా కార్య వర్గ సభ్యులు చెక్క వెంకటేష్ , బండి జంగమ్మ , చిగుళ్ల లింగం , పెరబోయిన మహేందర్ , ప్రజాపక్షం స్టాఫ్ రిపోర్టర్ దుడుక రామకృష్ణ , యాదగిరిగుట్ట మండల కార్యదర్శి కళ్లేపల్లి మహేందర్ , పట్టణ కార్య దర్శి బబ్బూరి శ్రీధర్ , నాయకులు పేరబోయిన పెంటయ్య , బంగారు , ముక్కెర్ల పెంటయ్య , పోచయ్య , మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.