📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనేటి బాలలే రేపటి భావి పౌరులు” – విద్యార్థుల కలలకు అండగా నిలిచిన శాలపల్లి సర్పంచ్...

నేటి బాలలే రేపటి భావి పౌరులు” – విద్యార్థుల కలలకు అండగా నిలిచిన శాలపల్లి సర్పంచ్ అశోక్

📰 Generate e-Paper Clip

**నేటి బాలలే రేపటి భావి పౌరులు” – విద్యార్థుల కలలకు అండగా నిలిచిన శాలపల్లి సర్పంచ్ అశోక్!**

హనుమకొండ జిల్లా | వేలేరు మండలం | శాలపల్లి గ్రామం | నవంబర్ 14, 2026
భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే బాలల దినోత్సవ వేడుకలు హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో ఘనంగా జరిగాయి.

గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ గ్రామసభలో విద్యార్థులు తమ పాఠశాల సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు.

పాఠశాలలో మరుగుదొడ్లు, స్టడీ టేబుళ్లు, క్రీడా సామగ్రి ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి గేట్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల అభ్యర్థనలపై వెంటనే స్పందించిన సర్పంచ్ కూరపాటి అశోక్.. వారు కోరిన ప్రతి అంశాన్ని తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. **“నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి”** అని ఆకాంక్షించారు.

అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాణి, ఉపాధ్యాయులు రాజు, రాజయ్య, శారద, అంగన్‌వాడీ టీచర్ సరస్వతి, సీఏ స్వరూప, వార్డు సభ్యురాలు లలిత, గ్రామ శాఖ అధ్యక్షుడు పోతారబోయిన సతీష్, గ్రామ పంచాయతీ సిబ్బంది రవీందర్, బొందిరాజ్, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.