📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనెహ్రూ ఆశయాలతోనే దేశ ప్రగతి.. బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి!

నెహ్రూ ఆశయాలతోనే దేశ ప్రగతి.. బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి!

📰 Generate e-Paper Clip

నెహ్రూ ఆశయాలతోనే దేశ ప్రగతి.. బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి!

ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి – బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొర్రె కిరణ్ కుమార్

హసన్‌పర్తి,నవంబర్14,(మన ప్రజావాణి):

దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవంబర్ 14న జరుపుకునే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులందరికీ గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొర్రె కిరణ్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వేసిన పునాదులు నేటి భారతదేశ ప్రగతికి బాటలు వేశాయని పేర్కొన్నారు. నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమానత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ, సృజనాత్మకత, నూతన ఆలోచనలు దాగి ఉంటాయని నెహ్రూ గారు విశ్వసించేవారని గుర్తుచేశారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారి ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పిల్లలకు భయంలేని బాల్యాన్ని అందిస్తూ, వివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.

విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించి, చిన్నారులకు మెరుగైన భవిష్యత్తును కల్పించినప్పుడే పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని గొర్రె కిరణ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.