📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్లక్ష్మీ దీపిక ద్వితీయ వర్ధంతి సందర్భంగా వివేకానంద సేవాశ్రమంలో అన్నదానం, వస్త్ర పంపిణీ

లక్ష్మీ దీపిక ద్వితీయ వర్ధంతి సందర్భంగా వివేకానంద సేవాశ్రమంలో అన్నదానం, వస్త్ర పంపిణీ

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (రంగసముద్రం),నవంబర్ 14:ప్రజావాణి తమ కుమార్తె జ్ఞాపకార్థం ఒక కుటుంబం చేపట్టిన సేవా కార్యక్రమం అందరి మన్ననలు పొందింది. పోరుమామిళ్ల మండలం, రంగసముద్రం పంచాయతీ పరిధిలోని మహబూబ్ నగర్ కాలనీకి చెందిన పల్లంశెట్టి పండరి, అరుణ దంపతుల ద్వితీయ పుత్రిక లక్ష్మీ దీపిక ద్వితీయ వర్ధంతి సందర్భంగా నేడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఆశ్రమవాసులకు అల్పాహారం, పండ్ల పంపిణీ ఈ సందర్భంగా ఓబులాపురం ఏటి ఒడ్డున పాపి జిన్ని రమణారెడ్డి, రామ తులసమ్మ దంపతులు నిర్వహిస్తున్న వివేకానంద సేవాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథ వృద్ధులు, దివ్యాంగులకు పల్లంశెట్టి పండరి కుటుంబ సభ్యులు స్వయంగా టిఫిన్ (అల్పాహారం), పండ్లను పంపిణీ చేశారు. అనంతరం స్వర్గస్తులైన లక్ష్మీ దీపిక ఆత్మకు శాంతి చేకూరాలని ఆశ్రమవాసులు, స్థానికులు కలిసి ప్రత్యేక దైవ ప్రార్థనలు నిర్వహించారు. సేవకులకు వస్త్రదానం, నిర్వాహకులకు సత్కారంఆశ్రమంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న సేవకుల కృషిని అభినందిస్తూ పల్లంశెట్టి పండరి వారికి నూతన వస్త్రాలను దానం చేశారు.అలాగే, ఎంతో మంది అనాథలకు, వృద్ధులకు అండగా నిలుస్తూ ఆశ్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న రామ తులసమ్మ ని శాలువాతో ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సేవా కార్యక్రమంలో నేలటూరి జయరాం రెడ్డి, కొరివి పోల్ రెడ్డి, డిస్కో రాజా,వంకదారి జయరాం, నాగేంద్ర, రమణాచారి,శ్రీనివాసులు రెడ్డి, నగిరి రమణయ్య తదితర గ్రామ ప్రముఖులు, స్థానికులు పాల్గొని లక్ష్మీ దీపిక చిత్రపటానికి నివాళులర్పించారు. తమ కుమార్తె వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు, అనాథలకు సేవ చేయడం పట్ల స్థానికులు పండరి, అరుణ దంపతులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.