లక్ష్మీ దీపిక ద్వితీయ వర్ధంతి సందర్భంగా వివేకానంద సేవాశ్రమంలో అన్నదానం, వస్త్ర పంపిణీ
పోరుమామిళ్ల (రంగసముద్రం),నవంబర్ 14:ప్రజావాణి తమ కుమార్తె జ్ఞాపకార్థం ఒక కుటుంబం చేపట్టిన సేవా కార్యక్రమం అందరి మన్ననలు పొందింది. పోరుమామిళ్ల మండలం, రంగసముద్రం పంచాయతీ పరిధిలోని మహబూబ్ నగర్ కాలనీకి చెందిన పల్లంశెట్టి పండరి, అరుణ దంపతుల ద్వితీయ పుత్రిక లక్ష్మీ దీపిక ద్వితీయ వర్ధంతి సందర్భంగా నేడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఆశ్రమవాసులకు అల్పాహారం, పండ్ల పంపిణీ ఈ సందర్భంగా ఓబులాపురం ఏటి ఒడ్డున పాపి జిన్ని రమణారెడ్డి, రామ తులసమ్మ దంపతులు నిర్వహిస్తున్న వివేకానంద సేవాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు....