📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనర్సింహులపేట గ్రామ పంచాయతీలో పిల్లల ప్రత్యేక గ్రామసభ

నర్సింహులపేట గ్రామ పంచాయతీలో పిల్లల ప్రత్యేక గ్రామసభ

📰 Generate e-Paper Clip

నర్సింహులపేట గ్రామ పంచాయతీలో పిల్లల ప్రత్యేక గ్రామసభ
నర్సింహులపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పిల్లల ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పిల్లల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల హక్కులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై చర్చించారు.
పిల్లలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి గ్రామ పంచాయతీ తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో సూచించారు. పిల్లలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బాలల హక్కుల పరిరక్షణతో పాటు ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి అశోక్, ఉప సర్పంచ్ కాస యాకయ్య,అంగన్‌వాడీ టీచర్లు, వార్డు మెంబర్ ఎల్లవుల ఉప్పలయ్య, విజయ ఉపేందర్, కార్యబార్ రమేష్ , పిల్లలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.