మృతుని కుటుంబానికి సర్పంచ్ సత్యనారాయణ 10వేల ఆర్ధిక సహాయం
మద్దూరు నవంబర్14, ప్రజా వాణి,
మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన కోడిపల్లి యాదయ్య శనివారం అనారోగ్యంతో మరణించారన్న విషాద వార్త తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మరియు మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ వెంటనే స్పందించి,మృతుని నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన వంతు చేయూతగా రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 6వ వార్డు సభ్యులు,రాగుల బాలు నర్సు, గంజే ఎల్లయ్య, ముస్శ్యాల మహేష్, షినిగరం కనకయ్య, మంతన మైపాల్ రెడ్డితో పాటు పలువురు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

