📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎల్కతుర్తిలో ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నిక.

ఎల్కతుర్తిలో ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నిక.

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తిలో ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నిక.

విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం చేయాలి.

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్.

ఎల్కతుర్తి, నవంబర్ 13 (ప్రజావాణి):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నూతన మండల కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా బొక్కలపాటి సన్నీ, మండల కార్యదర్శిగా చరణ్, ఉపాధ్యక్షుడిగా జాన్, సలహాదారులుగా బన్నీ, విష్ణువర్ధన్‌లను నియమించారు.
అనంతరం ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కమిటీ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎల్కతుర్తి మండలంలో విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు, విద్యార్థులకు అందాల్సిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల సమస్యలపై నిరంతరం దృష్టి సారించాలన్నారు.
చదువుతూ పోరాడు.. చదువుకై పోరాడు’ అనే నినాదంతో విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రతి విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని,మండలంలో ఎస్ఎఫ్ఐ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.