ఎల్కతుర్తిలో ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నిక.

ఎల్కతుర్తిలో ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నిక. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్. ఎల్కతుర్తి, నవంబర్ 13 (ప్రజావాణి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నూతన మండల కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా బొక్కలపాటి సన్నీ, మండల కార్యదర్శిగా చరణ్, ఉపాధ్యక్షుడిగా జాన్, సలహాదారులుగా బన్నీ, విష్ణువర్ధన్‌లను నియమించారు. అనంతరం...