📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు గంట రవికుమార్ దిశానిర్దేశం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు గంట రవికుమార్ దిశానిర్దేశం

📰 Generate e-Paper Clip

**గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు గంట రవికుమార్ దిశానిర్దేశం – బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి పిలుపు!**

వరంగల్, నవంబర్ 13, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా బీజేపీ కార్యకర్తలు నిరంతరం ప్రజల పక్షాన పోరాడాలని, రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు.

భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శివనగర్ మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, పార్టీ బలోపేతంలో వారి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

కార్యకర్తలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేయాలని సూచించారు. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త సైనికుడిలా సిద్ధంగా ఉండాలని, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, జిల్లా నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శివనగర్ మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి నాయకులు, కార్యకర్తలందరం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మార్తా ఉషారాణి, మండల ప్రధాన కార్యదర్శి వైట్ల గణేష్, బీజేపీ జిల్లా నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, బోడకుంట్ల శివశంకర్, జన్ను ప్రభాకర్, జారతి దేవక్క, తోట సాగరిక, డివిజన్ కన్వీనర్లు పోషాల సతీష్, తమ్మిశెట్టి క్రాంతి కుమార్, సూరజ్ తదితర మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.