ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 13
కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే నా లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు.
రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని DCHS అధికారులను ఆదేశించారు.
ప్రజారోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తోపాటు జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్, ఉప సర్పంచ్ ఫిర్దోస్, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్, మాజీ ఎంపిటిసి ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు విజయ్ కుమార్, సాయినాథ్, సాయి, తుకారం, తదితరులు కార్యకర్తలు, నాయకులు అభిమానులు పాల్గొన్నారు…


