మేడ్చల్ రహదారి నిర్మాణంలో భాగంగా మేడ్చల్ పట్టణంలోని జిందా షా మ దార్ దర్గా మసీదును, ఏడు గుడుల అమ్మవారి ఆలయాన్ని తొలగించడానికి జాతీయ రహదారుల వారు ఇచ్చిన నోటీసులను తాము అడ్డు కుంటామని జిల్లా డిసిసి అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ స్పష్టం చేశారు. మసీదు మరియు గుడి కమిటీలతో చర్చలు జరిపి ఒక స్పష్టతపై వచ్చేంతవరకు గుడిని కానీ మసీదును కానీ ముట్ట నివ్వని ఆయన హామీ ఇచ్చారు. అన్నారు మసీదునుకూడని కాపాడడానికి ముందుగా ప్రాధాన్యత ఇస్తామని,, ఒకవేళ జాతీయ రహదారుల చట్టం ప్రకారం ప్రజాహితం కోసం తొలగించాల్సి వస్తే రెండు మతాల ప్రార్ధన మందిరాల కోసం ప్రత్యామ్నాయంగా వేరే చోట నిర్మించి ఇచ్చేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతామని ఆయన తెలిపారు. మసీదు కమిటీ వారు కానీ ఆలయ కమిటీ వారు కానీ చింతించాల్సిన అవసరం లేదని ఈ విషయంలో తప్పక ఇరువర్గాల ఆమోదం పొందిన అనంతరమే జాతీయ రహదారుల అధికారులు పనులు చేపడతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్ గౌడ్ చాపరాజు వేముల శ్రీనివాస్ రెడ్డి యూసుఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..
మసీదును గుడిను కాపాడే ప్రయత్నం చేస్తా డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
RELATED ARTICLES

