రామన్నగూడెం ఎర్రబెల్లి గూడెంలో విసిపిసి కమిటీలు
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెం, ఎర్రబెల్లి గూడెం గ్రామాలలో ఐసిడిఎస్ అంగన్వాడి సూపర్వైజర్ జలగం సునిత ఆధ్వర్యంలో గురువారం గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. సంబంధిత కమిటీలను ఆయా యుపిఎస్ పాఠశాలల్లో సెలెక్ట్ చేశారు.రామన్నగూడెం విసీపీసీ కమిటీ చైర్మన్గా ఆ గ్రామ సర్పంచి బండి శ్రీనివాస్, ఎర్రబెల్లి గూడెం విసిపిసి కమిటీ చైర్మన్ గా స్థానిక సర్పంచి గుండెబోయిన ఉష అశోక్ వ్యవహరిస్తారు. కన్వీనర్ లు గా సంబంధిత గ్రామాల అంగన్వాడీ టీచర్లు, మరో 15 మంది ని సభ్యులుగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ విసిపిసి కమిటీలు గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కోసం కృషి చేస్తాయని తెలిపారు. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా వంటి ఎన్నో సమస్యల నిరోధానికి పరిష్కారం చూపుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బండి శ్రీనివాస్, గుండెబోయిన ఉష అశోక్,ఉపసర్పంచి, సాంబరాజు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు,గర్భిణీలు, తల్లులు విద్యార్థులు పాల్గొన్నారు.


