📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన – న్యాయ విజ్ఞాన సదస్సులు

విద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన – న్యాయ విజ్ఞాన సదస్సులు

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన – న్యాయ విజ్ఞాన సదస్సులు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జనగామ మండలం లోని వెంకీర్యాల, గానుగుపహాడ్ గ్రామాల పాఠశాలల్లో కార్యక్రమాలు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జనగాం ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ మంచాల రవీందర్ పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పోక్సో చట్టం గురించి వివరంగా తెలియజేశారు. సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ కంప్యూటర్, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, ఆన్‌లైన్ చాటింగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకోవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు.

అలాగే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) రూపొందించిన వీడియోను ప్రదర్శించి, పోక్సో చట్టంలోని అంశాలను సులభంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో వెంకీర్యాల, ఘనుగుపహాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వీరన్న, సుగేంద్రకుమార్ పాఠశాలల ఉపాధ్యాయులు, పారా లీగల్ వాలంటీర్లు బి.శేఖర్, పి.జితేంద్ర, ఎన్.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.