📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅడవిదేవులపల్లి మండలంలో ఉచిత క్షయవ్యాధి వైద్య శిబిరం మరియు జలసిరి పనులపై అవగాహన

అడవిదేవులపల్లి మండలంలో ఉచిత క్షయవ్యాధి వైద్య శిబిరం మరియు జలసిరి పనులపై అవగాహన

📰 Generate e-Paper Clip

​అడవిదేవులపల్లి మండలంలో ఉచిత క్షయవ్యాధి వైద్య శిబిరం మరియు జలసిరి పనులపై అవగాహన

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 12

​అడవిదేవులపల్లి,
మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామ పంచాయతీలో గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత క్షయవ్యాధి (TB) నిర్ధారణ వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. వైద్య బృందం గ్రామ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలతో పాటు ఎక్స్-రేలు తీశారు. ఈ సందర్భంగా టీబీ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్రభుత్వ అందిస్తున్న ఉచిత చికిత్సపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
​ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణంపై మార్కింగ్:
అదేవిధంగా, ‘VB-G RAM-G జలసిరి’ పనులలో భాగంగా గ్రామంలో నీటి సంరక్షణ చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, మ్యాజిక్ సోక్ పిట్స్, రూప్ టాప్ నీటి సేకరణ వ్యవస్థలు మరియు పశువుల తొట్ల నిర్మాణాలు చేపట్టాలని గ్రామస్తులకు సూచించారు. ఇందుకు సంబంధించి అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో మార్కింగ్ ఇవ్వడం జరిగింది.
​ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) హందాని, వైద్యాధికారి (MHO) ఎండీ అజహర్, ఎంపీవో మోసిన్ బిన్ అహ్మద్, సర్పంచ్ రాత్ల మోతిలాల్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఏఈ (RWS) రంజిత్, టెక్నికల్ అసిస్టెంట్ (TA) వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్ (FA) చిన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.