📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబిక్కనిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా కవల పిల్లలకు అన్నప్రాసన వేడుక

బిక్కనిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా కవల పిల్లలకు అన్నప్రాసన వేడుక

📰 Generate e-Paper Clip

బిక్కనిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా కవల పిల్లలకు అన్నప్రాసన వేడుక
బిక్కనిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా కవల పిల్లలకు అన్నప్రాసన వేడుక
దండేపల్లి, నవంబర్ 12 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం సెక్టార్ పరిధి బిక్కనిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఆరు నెలలు నిండిన కవల చిన్నారులకు గురువారం ఘనంగా అన్నప్రాసన వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు తొలిసారిగా అన్నం తినిపించి ఆశీస్సులు అందించారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్,మమత గ్రామ సర్పంచ్ చిలుకూరి మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, ఆరు నెలలు నిండిన తర్వాత తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారం అందించాలని తల్లులకు సూచించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతారని వివరించారు.
ఈ వేడుకలో అంగన్‌వాడీ టీచర్, ఆయా, గ్రామ పెద్దలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.