📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపేద ప్రజలకు సీఎం సహాయ నిధి కొండంత అండ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పేద ప్రజలకు సీఎం సహాయ నిధి కొండంత అండ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

పేద ప్రజలకు సీఎం సహాయ నిధి కొండంత అండ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, రాయపర్తి మండలాలకు చెందిన 69 మంది లబ్ధిదారులకు రూ.25,43,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): పేద ప్రజలకు సీఎం సహాయ నిధి కొండంత అండ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం
పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, రాయపర్తి మండలాలకు చెందిన అనారోగ్య బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) కింద మంజూరైన ఆర్థిక సహాయాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
నియోజకవర్గం కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్రూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు రూ.12,43,500 విలువైన చెక్కులు, రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల విలువైన చెక్కులను కలిపి మొత్తం 69 మంది లబ్ధిదారులకు రూ.25,43,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం కారణంగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయని, అలాంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని అన్నారు. అనుకోని అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం సహాయ నిధి కొండంత అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ మెరుగైన వైద్యం పొందకుండా ఉండకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. లబ్ధిదారులు ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్య సేవలు పొందాలని ఆకాంక్షించారు.

నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, తొర్రూరు మండల అధ్యక్షులు రవీంద్రాచరి, పట్టణ అధ్యక్షులు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, మేకల కుమార్, మహేష్ యాదవ్, రాయపర్తి మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, హమ్య నాయక్, ఉళ్లేంగుల యాదగిరి, మురళి, నర్సయ్య, సమ్మయ్య నాయక్, యూత్ మండల అధ్యక్షులు కళ్యాణ్, వివిధ గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.