📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎమ్మెల్యే కడియం శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనగామ జిల్లా డీసీసీ టీం

ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనగామ జిల్లా డీసీసీ టీం

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనగామ జిల్లా డీసీసీ టీం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి):
ఇటీవలే విదేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన శుభసందర్భంగా రాజకీయ కురువృద్ధులు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని జనగామ జిల్లా డీసీసీ టీం సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విదేశీ పర్యటన వివరాలను, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, రాబోయే కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఎస్సి డిపార్ట్‌మెంట్ చైర్మన్ వేముల మల్లేశ్ మహారాజ్, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జాయ మల్లేశ్, డీసీసీ జనగామ జిల్లా అధికార ప్రతినిధి నరేందర్ పవార్, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు కటకం ఉదయ్ కుమార్, సేవాదళ్ జిల్లా జాయింట్ సెక్రటరీ దరావత్ బాలు జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.