📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మండల స్థాయి వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మండల స్థాయి వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

📰 Generate e-Paper Clip

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మండల స్థాయి వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

* డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ మండల విద్యాధికారి కె. రాములు నాయక్, పాఠశాల హెచ్ఎం తస్లీమ్ నజ్మీమ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారుఈ

జమ్మికుంటనవంబర్ 11 ప్రజావాణి

కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయి వ్యాసరచన పోటీలునిర్వహించారుహుజురాబాద్‌కి చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో విద్య యొక్క ప్రాముఖ్యతఅనే అంశంపై ఈ పోటీలు జరిగాయిపోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ మండల విద్యాధికారి కె. రాములు నాయక్, పాఠశాల హెచ్ఎం తస్లీమ్ నజ్మీమ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారుఈ సందర్భంగా ఎంఈఓ రాములు నాయక్, హెచ్ఎం తస్లీమ్ నజ్మీమ్ మాట్లాడుతూ విద్య నిజమైన బలమని, జ్ఞానార్జన ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయవచ్చని పేర్కొన్నారు క్రమశిక్షణతో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారుఏఅనంతరం ట్రస్ట్ నిర్వాహకులు జగదీశ్వర్ మాట్లాడుతూ 2011 నుండి తమ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన ఎం. రచన (జెడ్పీహెచ్‌ఎస్ ఇల్లందకుంట), పి. నాగలక్ష్మి (కేజీబీవీ ఇల్లందకుంట)లకు శంకర్ నారాయణ డిక్షనరీ, మెమెంటోలను ప్రదానం చేశారు. అలాగే బి. రక్షిత, ఎం. అక్షయ్, ఎం. సహస్ర, కె. రితిక్, డి. కావ్యశ్రీ, బి. నితిన్, ఎం. అక్షయ్, డి. రితికలకు కన్సోలేషన్ బహుమతులుగా డిక్షనరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కే జయప్రకాష్, సిహెచ్. వేణు కే. సత్యం, జె. రాధిక రాణి, ఇతర ఉపాధ్యాయులు ఎస్. అనసూయ, ప్రేమ్ రాజు విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.