📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ వొగ్గు సాయికిరణ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ వొగ్గు సాయికిరణ్

📰 Generate e-Paper Clip

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ వొగ్గు సాయికిరణ్

• నేరడిగుంట ఎక్స్‌రోడ్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం

• మార్కెట్ అభివృద్ధికి సొంత నిధులతో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

• విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు శ్రీకారం

ఎన్నికల హామీని నెరవేర్చిన సర్పంచ్

మన ప్రజావాణి | నేరేడుగుంట | నవంబర్ 11 | జిల్లా ప్రతినిధి

నేరడిగుంట: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నేరడిగుంట గ్రామపంచాయతీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా నేరడిగుంట ఎక్స్‌రోడ్‌లో నెలకొన్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రామ సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఎక్స్‌రోడ్ ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్ సదుపాయం లేకపోవడంతో దుకాణదారులు, వ్యాపారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఎన్నికల సమయంలోనే గుర్తించిన సర్పంచ్, సమస్యను పరిష్కరించి మార్కెట్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా సొంత నిధులతో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

ఈ విద్యుత్ సదుపాయం అందుబాటులోకి వస్తే ఎక్స్‌రోడ్ మార్కెట్‌లో వ్యాపార కార్యకలాపాలు మరింత మెరుగుపడటంతో పాటు స్థానిక ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు తొలగనున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో చూపించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట కేవలం గెలుపు కోసం కాదు.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం. గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చడమే నా బాధ్యత. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొడండ ఈశ్వర్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రజల నమ్మకమే బలం.. గ్రామ అభివృద్ధే లక్ష్యం అనే నినాదంతో సర్పంచ్ ముందుకు సాగుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.